చలికాలంలో సహజంగానే మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తాం. అందుకనే ఈ కాలంలో స్వెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు తదితర దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటాం. అయితే దుస్తుల వరకు ఓకే.. కానీ.. మనం నిత్యం తీసుకునే పలు ఆహార పదార్థాలను కూడా మార్చినట్లయితే ఈ కాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అందుకు ఏమేం ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపు కలుపుకుని తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
* మన శరీరానికి వెచ్చదనం అందించడంలో అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. నిత్యం అల్లం టీని సేవిస్తే చలి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది.