రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రం అధోగతి.. బాబు రివర్స్ వాక్!

రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రం అధోగతి.. బాబు రివర్స్ వాక్!


జగన్ సర్కార్ రివర్స్ పాలనపై ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ కూడా వెనక్కి నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.


టెండర్లన్నీ రివర్స్ చేసుకుని.. రివర్స్ టెండరింగ్ అంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన రాజధాని అమరావతిని చంపేసి.. రివర్స్‌లో పాలన సాగిస్తున్నారన్నారు. వైసీపీ తుగ్లక్ పాలన కారణంగా ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడటమే కాకుండా.. విదేశీ పెట్టుబడులు సైతం రాని పరిస్థితిని కల్పించారని వాపోయారు. రివర్స్ టెండరింగ్‌ పేరుతో రాష్ట్రానికి లబ్ది చేకూరిస్తున్నామంటూ.. రాష్ట్రం అధోగతి పాలయ్యేలా చేస్తున్నారని చంద్రబాబు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.