ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా శాంసంగ్, షియోమీ, రియల్‌మి, ఆపిల్, వన్‌ప్లస్ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో అనేక ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
సేల్‌లో ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ 11ప్రొ, XR, ఐఫోన్ XS, ఐఫోన్ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా కార్డులతో ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.