యోగా వల్ల నేరాలను నియంత్రించొచ్చు..

నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తర్వాత యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. మానవ మృగాలను ఉరితీసి న్యాయ వ్యవస్థ చరిత్ర సృష్టించిందని రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడాలనుకునే వారికి ఇది ఒక ఉదహరణగా నిలుస్తుందన్నారు. నిర్భయ ఘటన దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని యోగా గురువు అన్నారు. పభుత్వం తప్పనిసరిగా యోగా, నైతిక విలువలను బోధించేలా కరిక్యూలమ్‌ను తయారు చేయాలని, దీని వల్ల ఘోరమైన నేరాలను నియంత్రించొచ్చు అన్నారు. పిల్లలకు సామాజిక అవగాహన కల్పించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని రామ్‌దేవ్‌ బాబా సూచించారు.